లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌లో తన నగలున్న పెట్టె చోరీకి గురైందని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తెలిపారు. వాటి విలువ రూ.70 లక్షలుంటాయని ఆమె పేర్కొన్నారు. ముంబయి నుంచి ఎమిరేట్స్ విమానం ద్వారా వింబుల్డన్ టోర్నమెంట్ వీక్షించడానికి లండన్‌కు వెళ్లిన సందర్భంలో తన నగలను బ్యాగేజీ బెల్ట్ ఏరియా నుంచి దొంగిలించారని ఆమె ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా సహకారం అందడం లేదని నిరాశను వ్యక్తం చేశారు.