ప్రెస్‌మీట్ మధ్యలో KCRకు కాల్ చేసిన అద్దంకి దయాకర్ (VIDEO)

TG: బీఆర్ఎస్ అధినేత KCRపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ చర్చలకు రావాలని కోరేందుకు తాను స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు. CM రేవంత్ రెడ్డి కూడా చర్చలకు రావాలని ఆహ్వానిస్తున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యత నిర్వర్తించడం లేదని విమర్శించారు. అలాగే కేటీఆర్, హరీష్ రావు, కవితలు కేవలం సైడ్ యాక్టర్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రలో హీనుడిగా మిగలకుండా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని దయాకర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్