ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీకి 14 రోజుల రిమాండ్‌

TG: ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుకు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందాలు హైదరాబాద్‌తో పాటు నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లోని 15 చోట్ల సోదాలు నిర్వహించి, సుమారు రూ.5.92 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను గుర్తించాయి. లెక్కలు చూపని ఆస్తుల కారణంగా భుజంగరావును అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన భుజంగరావుపై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్