ఆదిలాబాద్ ఘటన.. నిర్వహణ లోపాలే అగ్నిప్రమాదాలకు ఆజ్యం

TG: ఆదిలాబాద్ రిమ్స్ ఘటనతో తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్తు నిర్వహణ, ఫైర్ సేఫ్టీ లోపాలు బయటపడ్డాయి. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం ఆస్పత్రుల్లో వేలాడుతున్న వైర్లు, మూతలు లేని స్విచ్‌బోర్డులు రోగుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కాలం చెల్లిన అగ్నిమాపక సిలిండర్లు వాడటం గమనార్హం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం ఫైర్ సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో లోపాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕