ఆదిలాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో వడదెబ్బతో ఒక ఆవు మృతి చెందింది. ఈ విషయం తెలిసిన కాలనీవాసులు గోమాత సేవా ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించారు. ఫౌండేషన్ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతి చెందిన ఆవుకు అంత్యక్రియలు నిర్వహించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులైన సురేశ్, హేమన్షు, రాజశేఖర్, జగన్, సాయి, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.