ఆదిలాబాద్: కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి యత్నం

యూపీకి చెందిన మహిళను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి యత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న ADBకి వచ్చిన బాధితురాలు దారి తెలియక నిందితులను అడగగా, వారు బైక్‌పై తీసుకెళ్లారు. జైనథ్ మండలం నిరాల వద్ద అనుమానం వచ్చి ప్రతిఘటించడంతో దాడి చేసి నిందితులు పరారయ్యారు. గాయపడిన మహిళను రిమ్స్‌లో చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్, సంజీవ్‌లను అరెస్ట్ చేసి, వారి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్