ఆదిలాబాద్: బకాయిలు చెల్లించలేదని దుకాణం సీజ్

మున్సిపల్ పన్నులు చెల్లించని వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. శనివారం ADB బస్టాండ్ పరిసరాల్లో రెవెన్యూ అధికారి కళ్యాణ్ బృందం మెరుపు దాడులు నిర్వహించి, మూడేళ్లుగా కమర్షియల్ టాక్స్ చెల్లించకుండా మొండికేస్తున్న ఒక వ్యాపార సముదాయాన్ని సీజ్ చేసింది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని, బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని ఇన్ స్పెక్టర్లు అశోక్, అజయ్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్