ఆదిలాబాద్: అగ్రో డీలర్స్ నిరసన

ఎరువుల కంపెనీలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం ఆదిలాబాద్ ఎరువుల దుకాణాలను బంద్ చేపట్టారు. ఎరువుల ధరలు పెరగడం, లింక్ ఉత్పత్తుల వల్ల రైతులపై అదనపు భారం పడుతోందని, రవాణా ఖర్చులతో డీలర్లు నష్టపోతున్నారని అగ్రో డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివప్రసాద్ అన్నారు. ఎరువులు ఎలాంటి లింకు లేకుండా సరఫరా చేయాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్