పది ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా 21వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సైతం బాలికలే పైచేయి సాధించారు. మొత్తం 10,875 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 10,538 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో 5,227 మంది బాలురు, 5,311 మంది బాలికలు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 96.90గా నమోదైందని అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ తెలిపారు. ఫలితాలు తగ్గిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.