ఆదిలాబాద్: ఏఐఎఫ్‌బీ పార్టీలో చేరికలు

ఆదివారం, వార్డు నంబర్ 7 కేఆర్‌కే కాలనీలో కౌన్సిలర్ అభ్యర్థి పద్మతో కలిసి మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ రంగినేని మనిషా పర్యటించారు. ఈ సందర్భంగా టైగర్ గ్రూప్‌కు చెందిన సభ్యులు, కాలనీవాసులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీలో చేరారు. వారికి మనిషా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి ఏఐఎఫ్‌బీ పార్టీతోనే సాధ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్