ఆదిలాబాద్: కౌన్సిలర్ పదవి ఇప్పిస్తానంటూ నగదు కాజేత

కౌన్సిలర్ పదవి ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని రణదీవేనగర్‌కు చెందిన తోకల దేవేందర్‌కు వార్డు కౌన్సిలర్ పదవి ఇప్పిస్తానని స్థానిక వినాయక్ చౌక్‌కు చెందిన వెంకటేశ్ అనే వ్యాపారి నమ్మించాడు. దేవేందర్ నుంచి రూ. 12. 49 లక్షలు తీసుకున్నాడు. తను మోసపోయినట్లు గ్రహించిన దేవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్