సోమవారం ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం తీవ్ర ఉత్కంఠతో రసాభాసగా మారింది. ఎజెండా అంశాలను బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో సమావేశం విఫలమైంది. సమావేశ వైఫల్యానికి నిరసనగా బీజేపీ సభ్యులు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌ను నిలదీసి, సంతకాలు చేశారు. అయితే, సమావేశం వాడివేడిగా జరిగిందని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష, కాంగ్రెస్ సభ్యులు తెలిపారు.