ఆదిలాబాద్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

బేల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో ఓ చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మృతదేహాన్ని కిందికి దించారు. మృతుడు రామచంద్రగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్