పంచాయతీ కార్యదర్శులతో అసిస్టెంట్ కలెక్టర్ సమావేశం

ఇంద్రవెల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్