ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపురకు చెందిన అర్మాన్ అనే వ్యక్తిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఒకటో ఠాణా ఇన్స్పెక్టర్ బి. సునిల్ కుమార్ తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ జి. సంజయ్ కుమార్, అర్మాన్ గంజాయి తాగుతున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి రెండు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.