నిజాయితీ చాటుకున్న చిన్నారులు

దొరికిన సెల్ ఫోన్ ను పోలీసు స్టేషన్లో అప్పగించి చిన్నారులు నిజాయితిని చాటుకున్నారు. ఆదిలాబాద్ లోని బొక్కలగూడకు చెందిన సాద్విక్, రితేష్, శివరాజు స్థానిక డైట్ మైదానంలో క్రికెట్ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో వారికి అక్కడ సెల్ఫోన్ దొరికింది. దీంతో వారు వన్ టౌన్ వెళ్లి ఎస్సై ఉదయ్ కుమార్ కు అప్పగించారు. ఫోన్ ఆధారంగా రాంనగర్ కు చెందిన దేవీదాస్ గా గుర్తించి అందజేశారు. ఈ మేరకు చిన్నారులను పలువురు అభినందించారు

సంబంధిత పోస్ట్