నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మే 6న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ మేళాలో సుమారు 250 కంపెనీలు పాల్గొని, కస్టమర్ సర్వీస్, ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్ వంటి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లోమా, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగలవారు పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.