ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మె కొనసాగుతోంది. అందులో భాగంగా ఉద్యోగులు సంకెళ్లతో వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.