తాత్కాలికంగా స్విమ్మింగ్ పూల్ మూసివేత

వాతావరణ మార్పుల కారణంగా నీరు కలుషితం కావడంతో ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్‌ను నిర్వాహకుడు రాష్ట్రపాల్ జబాడే నేటి 11 నుంచి 14వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. పూల్‌లోని నీటిని తొలగించి శుద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పూల్ తిరిగి అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్