విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకం

ఉట్నూర్ పీఎంఆర్సీ భవనంలో ఐటిడిఎ పీవో మంద మకరందు ఉమ్మడి జిల్లాల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల అధికారులతో సమావేశమయ్యారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. గిరిజన విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, దానికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్