ఆదిలాబాద్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు, 44.1°Cకి చేరిన ఉష్ణోగ్రత

ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రతరం అయ్యాయి. గత 24 గంటల్లో చాప్రాలలో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బేల, జైనథ్‌లలో 44 డిగ్రీలు, సాత్నాల, హీరాపూర్‌లో 43.9 డిగ్రీలు నమోదయ్యాయి. జిల్లా అంతటా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్