ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 140వ మే డే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు జె. దళిత్ మాట్లాడుతూ పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, దురాక్రమణ యుద్ధ బారాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని, పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని, పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చికాగో నగరంలో కార్మికుల పోరాట స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్