జులై 31 నుంచి ఆగస్ట్ 31 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ధర్నాలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకే ఈ చర్యలు అని స్పష్టం చేశారు.