కొమురంభీం జిల్లాలో "ఆపరేషన్ ముస్కాన్-XI" కార్యక్రమం ద్వారా 48 మంది బాల కార్మికులను సంరక్షించామని శుక్రవారం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించిన ఘటనలపై 3 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామని, రెస్క్యూ చేసిన పిల్లలకు పునరావాసం, విద్య, కౌన్సిలింగ్ కల్పించామన్నారు. బాల కార్మిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.