పెళ్లి కావడం లేదని యువకుడి బలవన్మరణం !

కాగజ్‌నగర్‌ పట్టణంలో పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో సురేష్‌ (37) అనే యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్‌ తెలిపారు. సురేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నా నిశ్చయం కాకపోవడంతో మానసికంగా బాధపడేవాడని, ఆదివారం రాత్రి తండ్రితో కలిసి భోజనం చేసి నిద్రించిన తర్వాత ఉదయం ఇంట్లో ఉరేసుకుని కనిపించాడని ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్