కొమురంభీం జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంబారా శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాంకిడి ఏఎస్ఐ పోశెట్టి కథనం ప్రకారం.. వాంకిడి మండలం ఖేడేగాంకి చెందిన ఆత్రం సోనేరావు, మరో ద్విచక్రవాహనంపై మడావి దౌలత్ గణేష్ పూర్ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బంబార గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.