ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మత్ తిర్యాని మండలంలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, అందుతున్న సేవలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, హాజరు పట్టిక, ప్రగతి రికార్డులను తనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోందని నిర్ధారించుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు.