వాంకిడి మండలం ఇందానీ క్రాస్ రోడ్ వద్ద ఓ వ్యక్తి రోడ్ దాటుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం డీకొన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆసిఫాబాద్ వైపు నుంచి వాంకిడి వైపు వెళ్లే వాహనం ఢీకొట్టడంతో ఆ వ్యక్తి ఎగిరిపోయి రోడ్డు మీద పడడంతో తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్తానికులు అతనిని స్తానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమం మంచిర్యాల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.