ఆసిఫాబాద్: బర్త్ డే కేక్ లో సిగరెట్

బర్త్ డే కేక్ లో సిగరెట్ పీక వచ్చిన ఘటన కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లో చోటుచేసుకుంది. ఎంతో ఆనందంగా పుట్టినరోజు వేడుక జరుపుకుందామని పట్టణానికి చెందిన అజయ్ శుక్రవారం రాత్రి మహాలక్ష్మి బాలాజీ స్వీట్ హౌస్ లో కేక్ కొన్నాడు. ఇంటికి తీసుకువెళ్లి కట్ చేయగా అందులో సిగరెట్ పీక కనిపించడంతో స్వీట్ హౌస్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి స్వీట్ హౌజ్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు.

సంబంధిత పోస్ట్