కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరగనుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించనున్నారు. గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామ సడక్ యోజన, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి శాఖల పనితీరును పరిశీలించనున్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.