దొడ్డి కొమురయ్య వర్ధంతి ఘనంగా నిర్వహణ

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన అమరుడిగా దొడ్డి కొమురయ్యను స్మరించుకుంటూ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్, డీఆర్‌వో, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కామరె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్