ఆసిఫాబాద్: గుండి వాగుకు వరద నీరు.. నిలిచిన రాకపోకలు

ఆసిఫాబాద్ మండలంలో గురువారం తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండి వాగుపైన తాత్కాలిక ఓడ్డు వాగు ఉదృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గుండి గ్రామస్తులకు వాగు తగ్గే వరకు బాహ్య ప్రపంచంతో బంధం తెగినట్టే. గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్