తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని లింగాపూర్ కి చెందిన ప్రశాంత వాపోయింది. మామిడిపల్లికి చెందిన సాయి కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశానంది. ఓ మహిళతో లేచిపోయి వచ్చాక.. పెద్దల సమక్షంలో మళ్లీ అలా చేయను. చేస్తే విడాకులిచ్చి భరణం చెల్లిస్తానని ఒప్పుకున్నాడని పేర్కొంది. మళ్లీ ఆమె వద్దనే ఉంటున్నాడని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది.