కొమరంభీం జిల్లా కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. శనివారం జరిగిన సమావేశంలో రెండు వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా శ్యాం నాయక్ ఫొటోను సమావేశ బ్యానర్ లో పెట్టకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గపోరు కారణంగా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు మండిపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి.