పాము కాటుతో ఒకరి మృతి

కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రానికి చెందిన ఇప్ప ఎల్లమ్మ (71) బుధవారం పాముకాటుతో మృతి చెందింది. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్ప ఎల్లమ్మ చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బిందె పక్కన ఉన్న నాగుపాము ఎల్లమ్మ కుడి చేతిపై కాటు వేసింది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్