కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత, ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో అందిన అర్జీలను శాఖల వారీగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వెంకటులతో కలిసి అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.