వాంకిడిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ వివరాల ప్రకారం. వాంకిడికి చెందిన గేడం సోనేశ్వర్ శుక్రవారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వస్తుండగా రోడ్డుపై మహారాష్ట్ర వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో సోనేశ్వర్ తో పాటు బైక్ పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనేశ్వర్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్