వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సామెల గ్రామానికి చెందిన దేవల్ బాపు, అదే గ్రామానికి చెందిన తిప్పన్నగా స్థానికులు గుర్తించారు. ఇద్దరు వాంకిడి నుంచి సామెల గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్టు సమాచారం. చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్ లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.