కౌటాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం

కొమురంభీం జిల్లా కౌటల మండలం గుండాయిపేట గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం ఉదయం మిరుప చేనులో పని చేస్తున్న రైతుకు పులి కనిపించడంతో భయాందోళనలకు గురవుతున్నరు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న అడుగుల గుర్తులు చూసి పులి అని నిర్ధారించినట్లు ఎఫ్బీవో తెలిపారు. తాము చెప్పే వరకు ఎవరూ కూడా పంట చేలకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్