కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా.. వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు బందువులు ట్రాక్టర్ డ్రైవర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.