కెరమెరి: కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేక యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం. కెరమెరికి చెందిన సండే ఆకాశ్ (21) 2 నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి కడుపు నొప్పి రావడంతో బాధ భరించలేక పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే కెరమెరి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్