రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

కాగజ్‌నగర్ సమీపంలోని చింతగూడ రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాల–బల్లర్షా మార్గంలో జరిగిన ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు సమాచారం. రైల్వే పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 99484 81902, 87126 58605 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్