వాంకిడి ఎంపీడీవో ప్రభుదయ మృతి

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఎంపీడీవో నేరేటి ప్రభుదయ అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుదయ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎంపీడీవో మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్