బెజ్జూరు – కమ్మర్‌గాం రహదారి నిర్మించాలని గ్రామస్థుల డిమాండ్

కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలం నుంచి కమ్మర్‌గాం వరకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మార్గం అధ్వాన్నంగా ఉండటంతో కమ్మర్‌గాం సహా లోపలి గ్రామాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బెజ్జూరు–కమ్మర్‌గాం రహదారి నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్