మంగళవారం రాత్రి వాంకిడి మండల కేంద్రంలో లేండిగూడ గ్రామానికి చెందిన నిష్పత్తి (28) అనే యువకుడు కడుపు నొప్పితో బాధపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ చంద్రపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నొప్పి భరించలేక ఈ ఘోరానికి పాల్పడినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.