బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన మతిస్థిమితం లేని వివాహిత ఫర్హానా బేగం రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి యత్నించిందని రైల్వే ఏఎస్ఐ మోహన్ మంగళవారం తెలిపారు. కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ వెళ్లే సమయంలో రైల్వే ట్రాక్ పై ఆమె ఉన్నట్లు గుర్తించి కాపాడమని తెలిపారు. మహిళ భర్త గోదావరిఖనిలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని వివాహితను బంధువులకు అప్పగించినట్లు ఏఎస్ఐ వివరించారు.