బెల్లంపల్లి: క్యాంప్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట నెన్నెల మండలానికి చెందిన రైతు ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. గమనించిన అక్కడి పోలీసులు అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. తన చేనులో పత్తిని అటవీశాఖ అధికారులు నాశనం చేశారని వాపోయారు. అటవీశాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్