భీమిని మండలంలోని కమలాపూర్ ప్రాజెక్ట్ కట్ట సమీపంలో పోచమ్మ తల్లి విగ్రహం ఎదుట గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన చోటుచేసుకుంది. భీమిని, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన రైతులు పంటచేలకు వెళ్తుండగా ఈ తవ్వకాలను గమనించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఏటా రైతులు పోచమ్మకు పూజలు నిర్వహించే ఈ స్థలంలో తవ్వకాలు జరపడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.