కన్నేపల్లి మండలంలోని నాయకుని పేట గ్రామ పంచాయతీకి చెందిన హనుమంతుపై అదే గ్రామానికి చెందిన జింకమూర్ల నానయ్య కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు ఎస్సై గంగారం తెలిపారు. అప్పు చెల్లించనందుకు హనుమంతును మంగళవారం బైక్ పై ఇంటికి తీసుకువెళ్లి తాడుతో గుంజకు కట్టేసి కుటుంబ సభ్యులైన లక్ష్మీ, బిక్కయ్యతో కలిసి దాడి చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.