కన్నెపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ బంక్‌లో డిజిల్, పెట్రోల్‌లో నీళ్లు కలిశాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు కలవడంతో వాహనాలు చెడిపోతున్నాయని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను వారు డిమాండ్ చేశారు.